This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి మరియు అత్యంత సాధారణమైనవి ఏమిటి? (Pregnancy Cravings: When Do They Start and What Are The Most Common Ones in Telugu?)

Food Cravings
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి మరియు అత్యంత సాధారణమైనవి ఏమిటి? (Pregnancy Cravings: When Do They Start and What Are The Most Common Ones in Telugu?)
Likes10 Likes|
Read time9 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ సాధారణంగా మొదటి త్రైమాసికంలో మూడవ నుండి ఎనిమిదవ వారం మధ్య ప్రారంభమై, రెండవ త్రైమాసికంలో పీక్ కి చేరుకుని, మూడవ త్రైమాసికంలో తగ్గుతాయి.
  • హార్మోన్ల హెచ్చుతగ్గులు రుచి, వాసన, ఆకలిని ప్రభావితం చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు, ఊరగాయలు, స్పైసీ ఫుడ్, పీనట్ బటర్ వంటివి సాధారణ ప్రెగ్నన్సీ క్రేవింగ్స్.
  • సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా చిన్న భోజనాలు, అధిక ఫైబర్ ఫుడ్, తేలికపాటి వ్యాయామం ద్వారా క్రేవింగ్స్ ను నిర్వహించవచ్చు. ముడి మాంసం, పికాకు దూరంగా ఉండాలి.
  • ఈ కోరికలను తీర్చడానికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడం ఎలా? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5

మీకు ఒక డబ్బా ఐస్ క్రీమ్ కావాలనే కోరిక ఉందా? ఇది చాలా అసాధారణంగా అనిపిస్తున్నా, నెలల తరబడి కిచెన్ షెల్ఫ్ లో ఉన్న ఆ మసాలా, చిక్కటి ఊరగాయను మీరు సడన్ గా ఇష్టపడుతున్నారా? గర్భధారణ లో మీ కొత్త దశకు స్వాగతం. ఈ ఆర్టికల్ లో మైలో మీ విచిత్రమైన ఫుడ్ క్రేవింగ్స్ వెనుక ఉన్న కొన్ని రహస్యాల గురించి తెలుసుకోండి. ఎప్పుడు ఇంతలా తినలేదు అని మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. ఇది చాలా సాధారణం. ఇకనుంచి ఫుడ్ మీ కొత్త బెస్ట్ ఫ్రెండ్ కాబోతోంది.

ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ సాధారణంగా ఎప్పుడు ప్రారంభమవుతాయి? (When Do Pregnancy Cravings Usually Start in Telugu?)

ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ మొదటి త్రైమాసికం మూడవ వారం మరియు ఎనిమిదవ వారం మధ్య ప్రారంభమవుతాయి. చాలా మంది మహిళలకు, రెండవ త్రైమాసికంలో ఇటువంటి కోరికలు మొదలై మూడవ త్రైమాసికం వస్తున్న కొద్దీ తగ్గుతాయి. మీ గర్భధారణ ప్రారంభ దశలో, మీ ఫుడ్ ప్యాటర్న్ లో పూర్తి మార్పును మీరు గమనించవచ్చు. మీ ఆకలి మారవచ్చు. దీనిలో మీరు మీ ఆహార ప్రణాళికకు మీరు ఎప్పుడు తినని ఆహార పదార్థాలను కూడా జోడించవచ్చు. ఇదే కాకుండా మీ నోరంతా అదోలాంటి మెటల్ టేస్ట్ ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. వంట చేసేటప్పుడు కొన్ని ఆహార వాసనలకు కూడా మీరు మరింత సున్నితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాల విషయానికి వస్తే, కొన్ని ఆహారాలను తినకూడదన్న నియమం వలన మీకు మరిన్ని ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ కలిగే అవకాశం ఉంది. మీకు ఉన్న కోరికలు కూరగాయల నుండి విచిత్రమైన ఫుడ్ మిక్సింగ్ వరకు ఉండవచ్చు! ఏదేమైనా ఈ ఆకస్మిక మార్పులు మీ శరీరంలోని ప్రెగ్నన్సీ హార్మోన్ల వలన మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళలకు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటే, కొంతమంది ఏమీ అనుభవించకపోవచ్చు. ఎటువంటి ఫుడ్ క్రేవింగ్స్ లేకపోవడం కూడా సాధారణమే. వాస్తవానికి గర్భధారణ సమయంలో మీకు ఎలాంటి ఫుడ్ క్రేవింగ్స్ లేకపోవడం కూడా మంచిదే. ఫలితంగా మీరు ఆరోగ్యకరమైన ఫుడ్ ని తీసుకునేలా ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది.

ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా? ‌

ఫుడ్ క్రేవింగ్స్ కు కారణమేమిటి? (Causes of Food Cravings in Telugu?)

శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు రుచి, వాసన మరియు ఆకలి ఫీలింగ్ ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల వింత రుచులు, కలయికలు మరియు టేస్ట్ కోసం మీరు పరితపించి పోతారు. ఏదేమైనా గర్భధారణ హార్మోన్లు మీ శరీరానికి మారుతున్న అవసరాల గురించి సందేశాన్ని పంపుతూనే ఉంటాయి (కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్ మొదలైనవి), అయితే ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ తరచుగా అనారోగ్యకరమైన ఆహార ఎంపికల వైపు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

కొన్ని రకాల ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ ను పొందడం సాధారణమే అయినా ఆ క్రేవింగ్స్ అన్నిటిని తినకుండా ఉండడం అవసరం. మీకు, మీ బిడ్డకు అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ క్రేవింగ్స్ కు దూరంగా ఉండడమే ఉత్తమం. కొన్ని ప్రమాదకరమైన ఆహార క్రేవింగ్స్ లో ముడి సీఫుడ్ లేదా తక్కువ ఉడికించిన మాంసం ఉన్నాయి. అలా కాకుండా ముడి గుడ్లు మరియు పాశ్చరైజ్ చేయని జున్ను ఇతర ఉదాహరణలు. మీ ఫుడ్ క్రేవింగ్స్ ఎటువంటి హాని చేయకపోవచ్చు. కానీ, మీకు అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ కు దూరంగా ఉండడమే ఉత్తమం.

మీరు మీ కొత్త దశలోకి ప్రవేశించే ముందు, గర్భధారణ సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ మరియు ఆకలి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రేవింగ్ ఎక్కువగా ఒక నిర్దిష్ట రుచి లేదా ఆహార పదార్థంపై ఉంటుంది. ఆకలి ఒక ఆహారానికి ప్రత్యేకమైనది కాదు. బాగా తిన్న రెండు గంటల్లోపు మీకు ఆకలి అనిపిస్తోంది అంటే.. అది ఫుడ్ క్రేవింగ్ కు సంకేతం కావచ్చు.
అత్యంత సాధారణ గర్భధారణ కోరికలు కొన్ని ఏమిటి? (What Are Some Of The Most Common Pregnancy Cravings in Telugu?)


1. ఫాస్ట్ ఫుడ్ (Fast Food)

ఎక్కువ కెచప్ తో చీజీ పిజ్జా ముక్క ప్రస్తుతం మీకు మంచిగా అనిపిస్తుందా? ఇది మీ శరీరం ఎక్కువ సోడియం మరియు కొవ్వులను డిమాండ్ చేస్తూ పంపించే సంకేతం. ఈ ప్రలోభాలను ప్రతిఘటించడానికి ప్రయత్నించండి మరియు తెలివైన ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి.

2. స్వీట్లు (Sweets)

మీకు ఇప్పటికే తీపి తినే అలవాటు ఉంటే గర్భధారణ సమయంలో ఇది మరింత ఎక్కువగా మారుతుంది. చాక్లెట్ అనేది గర్భధారణ సమయంలో క్రేవింగ్స్ జాబితాలో ఒక సాధారణ ఐటమ్. ఒకవేళ ఈ క్రేవింగ్ ని నియంత్రించడం మీకు కష్టం అయితే, అధిక కోకో కంటెంట్ ఉన్న నాణ్యమైన డార్క్ చాక్లెట్ కి వెళ్ళండి. ఎందుకంటే ఇది మిల్క్ చాక్లెట్ తో పోలిస్తే ఎక్కువ ఫ్లేవనాయిడ్లు మరియు తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది.

3. ఊరగాయలు (Pickles)

ఇది కూడా మిమ్మల్ని ఈజీగా పక్కదారి పట్టించేసే క్రేవింగ్. గర్భధారణ సమయంలో ఊరగాయలు తినాలనే కోరిక శరీరంలో సోడియం లేకపోవడం వల్ల సంభవిస్తుంది. మీరు ఉప్పగా ఏదైనా కలిగి ఉండాలనుకుంటే, అప్పుడు ఊరగాయలు గొప్ప ఎంపిక కావచ్చు కాని మితంగా తీసుకోవాలి.

4. స్పైసీ ఫుడ్ (కారంగా ఉండే ఆహారం) (Spicy Food)

ప్రెగ్నెన్సీ సమయంలో మిరపకాయలు మరియు ఇతర స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం అనేది అత్యంత సాధారణ క్రేవింగ్. స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అయితే అతిగా తినకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది గుండెల్లో మంట మరియు ఇతర జీర్ణ సమస్యలు వంటి సమస్యలను కలిగిస్తుంది.

5. పీనట్ బటర్: (Peanut Butter)

ఈ ఆహారాన్ని కంఫర్ట్ ఫుడ్ అని కూడా అంటారు. ఒక పండుపై పీనట్ బటర్ ని పూయడం ద్వారా ఈ కోరికను తీర్చుకోండి. ఇది మీ స్వీట్ క్రేవింగ్ ను ఆస్వాదించడానికి మరియు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

6. పికా (Pica)

ఇది ఆహారం కాదు! ఇది పిల్లలలో కానీ కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలలో కనిపించే ఒక వింత క్రేవింగ్. ధూళి, బురద, సుద్దముక్క, కాలిన అగ్గిపెట్టెలు, ముల్తానీ మట్టి మరియు మరెన్నో ఆహారేతర పదార్థాలను తినాలని క్రేవింగ్ వస్తూ ఉంటుంది. ఈ వస్తువులను తినడం చాలా ప్రమాదకరం. కాబట్టి మీరు ఈ క్రేవింగ్స్ ను అనుభవిస్తే, మీ డాక్టర్ కి చెప్పడం చాలా ముఖ్యం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది?

ఒక వ్యక్తి ప్రెగ్నన్సీ క్రేవింగ్స్ ను ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? (How Can One Handle Their Pregnancy Cravings in Telugu)

మీ కోరికలను అప్రయత్నంగా నిర్వహించడానికి కొన్ని మార్గాలు కింద లిస్ట్ చేయబడ్డాయి!

  • డైయిరీ ఐటమ్స్, ప్రోటీన్, పండ్లు, చిక్కుళ్ళు మరియు తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా కలిగి ఉన్న ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తినడాన్ని ప్రయత్నించండి. అందువల్ల మీ ఆహారం ఆరోగ్యంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు ఒకసారి చీటింగ్ చేసి ఏమైనా తిన్నా మీ బిడ్డకు హానికరం కాదు!
  • క్రమం తప్పకుండా తినాలని నిర్ధారించుకోండి. తద్వారా మీరు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను అనుభవించాల్సిన అవసరం లేదు. ఒక రోజులో భోజనం యొక్క చిన్న భాగాలను విభజించడం మీ కోరికలను అదుపులో ఉంచడానికి మీకు సహాయపడుతుంది.
  • అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.
  • మీ డాక్టర్ ద్వారా రెకమండ్ చేయబడ్డ కొన్ని తేలికపాటి వ్యాయామాలను ప్రయత్నించండి.
  • చాక్లెట్లు మరియు బ్రౌనీలను తినాలనే నిరంతర క్రేవింగ్ మీకు ఉంటే, వంటగది నుండి బయటకు రావడం లేదా సినిమా చూడటం ద్వారా మీ మనస్సును మళ్లించడానికి ప్రయత్నించండి.
  • మీరు చిప్స్ కోసం ఆరాటపడుతున్నట్లయితే, మీరు కొవ్వు తీసుకోవడం తగ్గించడానికి బేక్ చేసిన చిప్స్ చిన్న ప్యాకెట్ తీసుకోండి.
  • తక్కువ క్యాలరీల ఆహార పదార్థాలతో అల్పాహారం తీసుకోవడాన్ని పరిగణించండి. ఉదాహరణకు మీరు ఐస్ క్రీం కోరుకున్నప్పుడు, ఇంట్లో ఉన్న చల్లని గడ్డ పెరుగుని తినండి! అలా కాకుండా ఫ్రిజ్ లోని మామిడి వంటి పండ్లు కూడా మీరు తీరని క్రేవింగ్స్ ను ఫీల్ అవుతున్నప్పుడు సహాయపడతాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఉత్తమమైన ఆహారం ఏమిటి?

గర్భధారణ సమయంలో మీరు ఏ ఆహారాలను నివారించాలి? (What Are Some Of The Most Common Pregnancy Cravings in Telugu?)

మీరు కొన్ని కోరికలను నివారించాలి ఎందుకంటే అవి మీ బిడ్డకు హాని కలిగిస్తాయి లేదా ముందస్తు ప్రసవానికి కూడా కారణమవుతాయి. ఈ ఆహారాలు సాధారణంగా ఎక్కువ కాలం నిల్వ చేసినట్లయితే కలుషితం అయ్యే ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు తక్కువ ఉడికించిన లేదా ముడిగా ఉన్న మాంసాలను మాత్రం దూరం పెట్టుకోండి. అలా కాకుండా సుషీతో పాటు మృదువైన చీజ్ లకు కూడా దూరంగా ఉండటం మంచిది.

కొన్నిసార్లు మీరు పికాను కూడా అనుభవించవచ్చు. ఇది సాధారణంగా పెయింట్ చిప్స్ మరియు ఇతర వికారమైన తినకూడని వస్తువులను రుచి చూడాలనే అసాధారణ క్రేవింగ్ ను కలిగి ఉంటుంది. ఈ పరిస్థితులలో అటువంటి కోరికలు సాధారణంగా విటమిన్ లోపాన్ని సూచిస్తాయి. చాలా సాధారణంగా ఐరన్. ఈ పరిస్థితిని సాధారణంగా రక్తహీనత (అనీమియా) అని పిలుస్తారు.

ముగింపు (Conclusion)

ప్రెగ్నన్సీ నిజంగా మీ జీవితంలో చిరస్మరణీయమైన దశ. మొదటి కొన్ని నెలలు అసాధారణమైన ప్రారంభ గర్భధారణ క్రేవింగ్స్ కు తగ్గట్టుగా మీరు కొత్త ఆహారాలను ప్రయత్నించడం ఖాయం. అందువల్ల మీ ఆనందం మరింత పెరుగుతుంది! కొన్ని మినహాయింపులతో, కొన్ని రుచికరమైన ఆహారాలతో మీకు మీరే మీ క్రేవింగ్స్ ను తృప్తి పరచుకుంటే ఇటుఅన్తి సమస్య ఉండదు. మీకు ఒక కస్టర్డ్ ఆపిల్ తీసుకురావడానికి మీ జీవితభాగస్వామిని అర్ధరాత్రి మార్కెట్ కు పంపడం లాంటివి కూడా జరగవచ్చు. అందువల్ల మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవడం మంచిది.

Tags:

Food cravings in telugu, Food cravings during pregnancy in telugu, Reasons for having food cravings in telugu, What the best food options during food cravings while pregnant in telugu, Foods to avoid during pregnancy in telugu.

Also Read in

Bengali: যে উপায়ে আপনি গর্ভাবস্থায় রাস্তার খাবারের লোভ সামলাতে পারেন

English: Ways in Which You Can Handle Street Food Cravings During Pregnancy

Hindi: Street Food Cravings During Pregnancy in Hindi | प्रेग्नेंसी में स्ट्रीट फूड्स की क्रेविंग से कैसे निपटें?

Tamil: கர்ப்ப காலத்தின் போது உங்களுக்கு சாலையோர உணவுகள் மீது உண்டாகும் நாட்டத்தை கட்டுப்படுத்தும் வழிகள்(Ways in which you can handle street food cravings during the pregnancy period In Tamil)

గర్భిణీ మాతృమూర్తులు నమ్మే పోషకాహార మద్దతు

క్రేవింగ్స్ సమయంలో మీకు మరియు మీ బిడ్డకు అవసరమైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3674 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.